ANJALI:డోర్స్ క్లోజ్.. వాష్‌రూం వెళ్లకుండా గంటలపాటు బోల్డ్‌ సీన్స్‌లో నటించా: అంజలి

by Anjali |
ANJALI:డోర్స్ క్లోజ్.. వాష్‌రూం వెళ్లకుండా గంటలపాటు బోల్డ్‌ సీన్స్‌లో నటించా: అంజలి
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయన్ అంజలి నటించిన ‘బహిష్కరణ’ వెబ్ సిరీస్ రీసెంట్‌గా విడుదలై.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ప్రముఖ ఓటీటీ ‘జీ 5’ లో రిలీజైన ఈ సిరీస్‌లో అంజలి వేశ్య పాత్రలో అద్భుతంగా నటించింది. తెలుగు నటి అయినందుకు వంద శాతం ఆ పాత్రకు న్యాయం చేసిందని, మరో నటి ఎవరు నటించిన ఆ ఫీల్ తీసుకురాలేకపోయేవారు అంటూ హీరోయిన్ పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇకపోతే ఈ సిరీస్‌లోని ఇంటిమేట్ సీన్స్ అనుభవం గురించి అంజలి తాజాగా ఓ చెప్పుకొచ్చింది. ‘‘ఇలాంటి సన్నివేశాల్లో నటించాలంటే ముందుగా కొంచెం టెన్సన్ పడ్డాను.

కాస్ట్యూమ్స్ కారణంగా వాష్‌రూం వెళ్లడానికి చాలా ఇబ్బంది పడ్డాను. కొన్ని గంటలపాటు అసలు వెళ్లలేదు. కానీ ఈ సిరీస్‌కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఎందుకంటే మేకప్‌తో పాటు వేసుకున్న దుస్తులు కూడా నలిగిపోతాయి. ఈ సీన్స్ చిత్రికరించేటప్పుడు కొంచెం కష్టంగా అనిపించింది. దీంతో అందరినీ బయటికి పంపించి డోర్స్ క్లోజ్ చేసి ఈ సన్నివేశాల్ని చిత్రికరించారు’’. అంటూ హీరోయిన్ అంజలి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. హీరోయిన్ కామెంట్స్ విన్న నెటిజన్లు.. కొంతమంది ప్రశంసలు కురిపించగా.. మరికొంతమంది అంత అసౌకర్యంగా ఫీల్ అవుతూ చేయడం అవసరమా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.



Next Story

Most Viewed