- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
త్వరలోనే పెళ్లి.. అంతలోనే విడిపోతున్నామని ప్రకటించిన జంట!
దిశ, సినిమా : సోషల్ మీడియాలో తమ ఫొటోలతో తెగ హల్ చల్ చేసిన ముద్దుగుమ్మలు అంజలి, సూఫీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారత్‌కు చెందిన అంజలి, పాకిస్తాన్‌కు చెందిన సూఫీ మాలిక్ స్వలింగ సంపర్కులు. వీరు ఐదు సంవత్సరాలుగా కలిసే ఉంటున్నారు. ఎప్పుడూ తమ రొమాంటిక్ ఫొటో షూట్‌తో నెటిజన్స్‌ను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 2019లో వీరు తమ ఫోటో షూట్‌తో తెగ హడావిడి చేశారు. సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేశారు.
అయితే ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించి, ఒక్కసారిగా షాకిచ్చారు. తాము విడిపోతున్నాం అని ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. తాము పెళ్లి చేసుకోవడం లేదని, అంజలని నేను చీట్ చేశాను, నేను చేసిన తప్పుల కారణంగానే మేమిద్దరం విడిపోతున్నాం అంటూ సూఫీ తన ఇన్ స్టాలో పేర్కొంది. ఇక అంజలి సూఫీపై తనకు ఎలాంటి కోపం లేదని, తనతో గడిపిన రోజులు నేను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.