Suma Kanakala : మీడియాకు క్షమాపణ చెప్పిన యాంకర్ సుమ.. (వీడియో)

by sudharani |   ( Updated:2023-10-26 12:51:54.0  )
Suma Kanakala : మీడియాకు క్షమాపణ చెప్పిన యాంకర్ సుమ.. (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో పంజా వైష్టవ్ తేజ్, శ్రీ లీల కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘ఆదికేశవ’. యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీకి శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్నాడు. నవంబర్-10 న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ మూవీ నుంచి రీసెంట్‌గా థర్డ్ సింగిల్ ‘లీలమ్మో’ పాట విడుదల చేశారు మేకర్స్. ఈ వేడుక బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సుమ యాంకర్‌గా వ్యవహరించారు.

ఈ క్రమంలోనే మీడియా వారు స్నాక్స్‌ను భోజనంలా తింటున్నారని ఆమె అన్నారని.. అలా అనకుండా ఉండే బాగుండేదని ఓ రిపోటర్ అభిప్రాయం వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన సుమ ‘మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఈ రోజు ఒక ఈవెంట్‌లో నేను చేసునటువంటి వ్యాఖ్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయని నాకు అర్థం అవుతోంది. దీనికి నిండు మనసుతో క్షమాపణ కోరుకుంటున్నాను. నాకు తెలుసు మీరు ఎంత కష్టపడి పని చేస్తారో.. మీరు నేను కలిసి గత కొన్ని సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తున్నాం. నన్ను కుటుంబ సభ్యులు గా భావించి క్షమిస్తారని కోరుకుంటున్న’ అంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది సుమ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed