ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ యాంకర్ మృతి

by sudharani |   ( Updated:2023-07-11 06:56:51.0  )
ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ యాంకర్ మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొంతకాలంగా ఇండస్ట్రీలో వరుస విషాదాలు జరుగుతున్నాయి. అప్పటి వరకు బాగానే ఉన్న నటీనటులు ఉన్నట్టుండి మృత్యువాత పడుతున్నారు. ఈ క్రమంలో మరో విషాదం జరిగింది. ప్రముఖ యాంకర్, లైవ్ హోస్ట్ శివాని సేన్ మృతి చెందారు. ఎపిలెప్టిక్ ఎటాక్ అనే అనారోగ్య సమస్య వల్ల ఆమె చనిపోయినట్లు తెలుస్తోంది. 2005లో యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన శివాని.. యాంకరింగ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కార్పొరేట్ ఈవెంట్లు, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు, ఫ్యాషన్ షోలకు హోస్ట్‌గా వ్యవహరించారు. ఇటీవల TS ప్రభుత్వం నిర్వహించిన దశాబ్ది ఉత్సవాలకు ఆమెనే హోస్ట్‌గా చేశారు. శివానికి పెళ్లై ఓ కొడుకు కూడా ఉన్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఎపిలెస్టిక్ అనే బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె.. సడెన్‌గా అనరోగ్యానికి గురై తుదిశ్వాస విడిచారు. ఆమె మరణం పట్ల పలువురు ప్రముఖులు, పలు సంస్థలు సంతాపం తెలియజేస్తున్నారు.

Read More: ఇలాంటి అభిమానులు పవన్ కల్యాణ్‌కు మాత్రమే (వీడియో)

Advertisement

Next Story

Most Viewed