అరుదైన వ్యాధితో బాధపడుతున్న యాంకర్ రష్మీ.. అవి వాడాలంటూ సలహాలు

by Kavitha |
అరుదైన వ్యాధితో బాధపడుతున్న యాంకర్ రష్మీ.. అవి వాడాలంటూ సలహాలు
X

దిశ, సినిమా: జబర్ధస్త్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో రష్మీ గౌతమ్ కూడా ఒకరు. స్మాల్ స్క్రీన్‌పై యాంకర్‌గా అలరిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నది. కెరీర్ తొలినాళ్లలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కరెంట్, హోలి వంటి సినిమాల్లో నటించింది. తర్వాత యాంకర్‌గా జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలో తన వచ్చిరాని తెలుగుతో ప్రేక్షకులను మెప్పి్ంచింది. తర్వాత గుంటూర్ టాకీస్, రాణి గారి బంగ్లా. అంతం వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి తన అందంతో కవ్వించింది. ఇలా ఓ వైపు షోలతో, మరోవైపు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఈ అమ్మడు ఓ అరుదైన వ్యాధితో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం స్వయంగా తానే వెల్లడించింది. వివరాల్లోకి వెళితే..

గతంలో రష్మీ మాట్లాడుతూ.. గతంలో అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటిస్తూ తనకు రూమటాయిడ్‌ అనే సమస్య ఉందనే విషయాన్ని బయట పెట్టింది రష్మీ. అలాగే దీని నుంచి కోలుకోవడానికి కొన్ని సలహాలు కూడా ఇచ్చింది. దీనికి ఎలాంటి చికిత్స లేదని.. లైఫ్ స్టైల్‌లొ మార్పులు చేసుకుంటే ఫలితం ఉంటుందని తెలిపింది. అలాగే స్ట్రెస్ తగ్గించుకోవాలి, పాజిటివ్ మైండ్ తో ఉండాలి. అదేవిధంగా ఈ వ్యాధితో బాధపడేవారు ఆయుర్వేద మందులు వాడాలని చెప్పుకొచ్చింది. అలాగే దీని నుంచి బయటపడటానికి స్టెరాయిడ్స్ తీసుకున్నానని చెప్పుకొచ్చింది. తనకు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు బాగా నొప్పిగా ఉండే ఇంజెక్షన్స్‌ను తీసుకున్నాను అని తెలిపింది రష్మీ గౌతమ్.

కాగా ఇది ఒక ఆటో ఇమ్యూనిటీ వ్యాధి. దీని వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి త్వరగా జబ్బున పడే అవకాశాలు ఉంటాయి. ఏదైనా అనారోగ్యం వస్తే త్వరగా కోలుకోలేరు.

Advertisement

Next Story

Most Viewed