- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కమిట్‌మెంట్‌పై అనసూయ రియాక్షన్.. మూడు నిమిషాల్లోనే అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, సినిమా: అనసూయ యాంకర్‌గా కెరీర్ మొదలెట్టి ‘జబర్దస్త్’ షో ద్వారా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. కానీ గత కొద్ది కాలంగా యాంకరింగ్‌కు పూర్తిగా గుడ్ బై చెప్పేసి నటనపై ఫోకస్ పెట్టింది. వరుస చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ పలు పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ కాస్టింగ్ కౌచ్ ఎదురైనప్పుడు ఎలా ప్రవర్తించాలో స్పందించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘ ఒక సినిమా మాట్లాడటానికి వచ్చినప్పుడు ఎదుటి వారు ఎలాంటి ఉద్దేశంతో ఉన్నారో మొదటి మూడు నిమిషాల్లోనే అర్థం అయిపోతుంది.
మన నుండి ఏదైనా ఆశిస్తున్నారని తెలిసినప్పుడు నా భర్త, పిల్లల గురించి చెప్తాను. దీంతో వాళ్లు నా ముందు ఆ టాపిక్ తీసుకురారు. అలా ఎందుకు చేస్తానంటే.. ఇండస్ట్రీలో ఉండాలంటే వివాదాలు పెట్టుకోకూడదు. కాబట్టి అర్థం అయ్యేలా మాట్లాడి వచ్చేయాలి. అలాంటప్పుడు ఇబ్బంది పడే పరిస్థితి రాదని అనుకుంటున్నాను. కమిట్‌మెంట్ అడిగినప్పుడు కర్ర విరగకూడదు.. పాము చావకూడదు అన్నట్లు వ్యవహరించాలి. ముందు అలాంటి ఆలోచన ఉన్నవాళ్లతో జాగ్రత్తగా ఉండాలి’’ అంటూ చెప్పుకొచ్చింది. అనసూయ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు తెలివైన దానివే అని అంటున్నారు.
Read More...