విమానంలో అవమానం.. తట్టుకోలేకపోతున్న Anasuya Bharadwaj

by srinivas |   ( Updated:2022-10-19 14:22:56.0  )
విమానంలో అవమానం.. తట్టుకోలేకపోతున్న Anasuya Bharadwaj
X

దిశ,సినిమా: టాలీవుడ్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుస చిత్రాలతో చాలా బిజిబిజిగా ఉంటున్న ఆమె.. తాజాగా బెంగుళూరు నుంచి హైదరాబాద్ కుటుంబ సభ్యులతో ప్రయాణమైంది. దీనికోసం ఒక ఎయిర్ లైన్స్ సంస్థలో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంది. అయితే టికెట్‌లో ఉన్న సమయం కన్నా కాస్త ముందే ఎయిర్‌పోర్ట్‌కి రావాలని ఎయిర్ లైన్ సంస్థ సందేశం పంపిందట.

దీంతో ఎయిర్ పోర్ట్‌తో పాటు ఫ్లైట్‌లో ఎదురైన ఇబ్బందికర పరిస్థితులను వివరిస్తూ అనసూయ సోషల్ మీడియాలో సందేశం పోస్ట్ చేసింది. ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాక మాస్కులు లేవని లోపలి పంపలేదట. మాస్కులు ధరించి ఫ్లైట్ లోపలికి వెళ్లగానే వరుసగా బుక్ చేసిన సీట్లు అక్కడక్కడ కేటాయించారట. వేరు వేరుగా ఎలా కూర్చోబెడతారని అనసూయ అడిగితే సమాధానం ఇవ్వలేదట. పైగా అనసూయ కూర్చున్న సీటు కూడా చిరిగిపోయి ఉండటం వల్ల సీటు‌కు ఉన్న పదునైన రాడు తగిలి ఆమె చొక్కా చిరిగి పోయిందట. దీంతో ఆమె ప్రయాణం చేసిన ఎయిర్ లైన్స్ సంస్థను చెత్త సంస్థగా వివరిస్తూ నెట్టింట చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story