Saripodhaa Sanivaaram: సరిపోదా శనివారం నుంచి అదిరిపోయే అప్డేట్

by Prasanna |
Saripodhaa Sanivaaram: సరిపోదా శనివారం నుంచి అదిరిపోయే అప్డేట్
X

దిశ, సినిమా: నాని హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘సరిపోదా శనివారం’. ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. రిలీజ్ కు ముందే భారీ హైప్ ను క్రియోట్ చేసిన ఈ మూవీ ఆగస్టు 29న థియేటర్లలో సందడీ చేయనుంది. రిలీజ్ డేట్ కు దగ్గరపడుతున్న క్రమంలో మూవీకి సంబంధించిన ఏదోక అప్డేట్ మూవీ మేకర్స్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా వదిలిన లుక్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.

చిత్ర టీం విడుదల చేసిన పోస్టర్ లో నాని లుక్ అదిరిపోయింది. ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపించ అంచనాలను భారీగా పెంచేసారు. చేతితో ఆయుధం పట్టుకుని ఉగ్ర రూప దాల్చినట్లు పోజ్ ఇచ్చాడు. ఈ మూవీలో కేవలం శనివారం రోజు మాత్రమే తన శత్రువులను వెంటాడి చంపుతాడు. దీనిలో నాని పాత్ర చాలా కొత్తగా ఉండబోతుంది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీలో నాని సరసన కన్నడ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ నటించగా.. స్టార్ నటుడు ఎస్‍.జే సూర్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇప్పటి వరకు రిలీజ్ అయినా పోస్టర్స్ అన్ని చూస్తే గమనిస్తే.. ఈ మూవీలో నాని డిఫరెంట్ గా కనిపించనున్నారని తెలుస్తోంది. ఇది చూసిన ఫ్యాన్స్, నెటిజెన్స్ బ్లాక్ బస్టర్ పక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed