- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bigg Boss Season-8: తెలుగు బిగ్‌బాస్ సీజన్-8 లోకి అమృత ప్రణయ్.. క్లారిటీ ఇస్తూ పోస్ట్ (వీడియో)
దిశ, సినిమా: రియాలిటీ బిగ్‌బాస్ షో ఇప్పటికే 7 సీజన్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. తొందరలోనే సీజన్-8 ప్రారంభం కాబోతుంది. సెప్టెంబర్ 1 నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఇటీవల అధికారిక ప్రకటనను కూడా నాగార్జున విడుదల చేశారు. ఈ క్రమంలో.. ఈ షోలో పాల్గొనబోతుంది వీరే అని కొన్ని పేర్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే అమృత ప్రణయ్ కూడా బిగ్‌బాస్-8లో పాల్గొనబోతున్నట్లు వార్తలు రావడంతో కొందరు ఆమెను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. దీంతో ఆమె యూట్యూబ్‌లో ఓ వీడియో చేసి క్లారిటీ ఇచ్చింది. ‘‘చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న బిగ్ బాస్ షోకి వెళుతున్నారట కదా? అని అంటున్నారు. కొందరైతే ఆల్ ది బెస్ట్ కూడా చెబుతున్నారు. కానీ నేను బిగ్ బాస్ షోలో పాల్గొనడం లేదు.
ఎవరూ నన్ను సంప్రదించలేదు. నాకు ఎలాంటి ఫోన్ రాలేదు. ఈ పుకారు ఎలా పుట్టిందో తెలియదు. ఆఫర్ వస్తే వెళతారా? అంటే అప్పటి పరిస్థితులను బట్టి ఉంటుంది. వెళ్లొచ్చు వెళ్లకపోవచ్చు.. అని అమృత ప్రణయ్ క్లారిటీ ఇచ్చింది. అలాగే తన లైఫ్ స్టైల్ గురించి పలు విషయాలు అభిమానులతో పంచుకుంది. ఇక అమృత ప్రణయ్ వివరాల్లోకి వెళితే. 2018లో ప్రేమ పెళ్లి చేసుకోవడంతో ఆమె తండ్రికి నచ్చక ప్రణయ్‌ను హత్య చేయించాడు.
దీంతో అమృత భర్త మృతి చెందాడు. అయితే ఈ కేసులో ఆమె తండ్రితో పాటు కొంతమంది నిందితులు అరెస్ట్ అయ్యారు. అప్పట్లో ఈ సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై రామ్ గోపాల్ వర్మ సినిమా కూడా తీయడంతో జీవిత కథతో ఆమె ఫుల్ ఫేమస్ అయింది. అలాగే అప్పటి నుంచి యూట్యూబర్‌గా మారి వీడియోలు షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ పలు పోస్టులు పెడుతూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటుంది.
(Video Link Credits to amruthapranay Instagram Channel)