హైదరాబాద్‌లో కెమెరాలకు చిక్కిన అమితాబ్..

by Nagaya |
హైదరాబాద్‌లో కెమెరాలకు చిక్కిన అమితాబ్..
X

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బీ భాగ్యనగరంలో సందడి చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లోనే మకాం వేసిన ఆయన గురువారం సాయంత్రం రాయదుర్గం మెట్రో స్టేషన్ వద్ద కెమెరాలకు చిక్కారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ దీపికా పదుకొనే జంటగా తెరకెక్కుతున్న మూవీ ప్రాజెక్ట్ K. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ముఖ్యపాత్ర పోషిస్తు్న్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ K షూటింగ్ హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో జరుపుకుంటుంది. దీనిలో భాగంగా గురువారం రాయదుర్గం మెట్రో స్టేషన్ వద్ద జరిగిన షూటింగ్‌లో పాల్గొనేందుకు అమితాబ్ అక్కడికి రావడంతో ప్రయాణికులు ఆయనను చూడటానికి ఎగపడ్డారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story