అన్ని లక్షలు పెట్టి కొత్త కారు కొన్న అమర్ దీప్, తేజస్విని.. వీడియో వైరల్

by Kavitha |   ( Updated:2024-05-11 14:47:43.0  )
అన్ని లక్షలు పెట్టి కొత్త కారు కొన్న అమర్ దీప్, తేజస్విని.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: పలు సీరియల్స్‌లో నటించిన బుల్లితెర జంట అమర్ దీప్, తేజస్విని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ తమకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్నారు. అయితే అమర్ బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్‌గా పాల్గొని రన్ రప్ గా నిలచిన విషయం తెలిసిందే. బిగ్‌బాస్ తర్వాత అమర్ హీరోగా చేయబోతున్న సినిమాలో సీనియర్ నటి సురేఖా వాణి కూతురు సుప్రిత హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది అని ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తూనే ఉన్నాయి. అలాగే తేజస్వి కూడా ఒక పక్క యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ మరోపక్క కన్నడ ఛానల్లో పలు షోలలో అలరిస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ బుల్లితెర జంట ఓ కొత్త కారును కొనుగోలు చేశారు ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా, తేజస్విని ఆ కొత్త కారు ముందు నిల్చుని ఫోటోలు దిగింది. ఇక ఆ ఫోటోలో కొత్త కారు కొన్నామనే సంతోషం ఆమె మొహంలో పక్కాగా కనబడుతుంది.

అయితే ఆ కారు ఓపెనింగ్ కు అమర్ దీప్, తేజస్విని, అరియానా ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా సందడి చేసిన ఓ రీల్ కూడా తేజస్విని షేర్ చేసింది. ఇకపోతే అమర్, తేజస్విని బ్లాక్ కలర్ టాటా సఫారిని కొన్నట్లు ఆ వీడియో స్పష్టంగా తెలుస్తోంది. అయితే దీని ధర పదహారు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల మధ్య ఉంటుందని తెలుస్తోంది. ఇక కారుతో చేసిన ఆ రీల్ వీడియో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.

Read More...

అక్షయ తృతీయ నాడు రూ. 15 లక్షల జ్యువెల్లరీని తల్లికి గిఫ్టుగా ఇచ్చిన బిగ్‌బాస్ విన్నర్.. పోస్ట్ వైరల్


Advertisement

Next Story
null