ఘనంగా అమలాపాల్ సీమంతం.. బ్యూటిఫుల్ పిక్స్ వైరల్

by Indraja |
ఘనంగా అమలాపాల్ సీమంతం.. బ్యూటిఫుల్ పిక్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ అమలాపాల్ గురించి సుపరిచితమే. మలయాళీ బ్యూటీ అయిన తెలుగు హీరోల సరసన అద్భుతంగా నటించి.. ప్రేక్షకుల మన్ననలు పొందింది. రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోల సరసన నటించి టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఈ డస్కీ బ్యూటీ గతేడాది జగత్ దేశాయ్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. నవంబరు 5 న వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లైన రెండు నెలలకే ప్రెగ్రెన్సీ అని ప్రకటించి.. ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్పారు. ప్రస్తుతం అమలాపాల్ ప్రెగ్నెన్సీ పీరియడ్‌ను ఎంజాయ్ చేస్తోంది. ప్రెగ్నెన్సీ విషయం బయటపెట్టినప్పటి నుంచి ఈ బ్యూటీ బేబీ బంప్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది. తాజాగా అమలాపాల్ తన సీమంతం వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఫ్యాన్స్‌కు షేర్ చేసింది. ఈ పిక్స్‌కు ప్రేమానురాగాలతో కూడిన సంప్రదాయమైన సీమంతం వేడుక’ అని క్యాప్షన్ రాసుకొచ్చింది. గుజరాత్‌లోని సూరత్‌లో జరిగిన ఈ బ్యూటీ సీమంతం ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story