- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీలో పవన్ డాటర్‌గా అల్లు అర్హ !
దిశ, వెబ్ డెస్క్ : 'గబ్బర్ సింగ్' మూవీ తర్వాత పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో రాబోతున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. ప్రస్తుతం 'హరిహరవీరమల్లు' చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్న పవన్, మరోవైపు భగత్ సింగ్ మూవీ షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన న్యూస్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో పవన్ కూతురి పాత్రలో అల్లు అర్జున్ కూతురు, అల్లు అర్హని తీసుకోబోతున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు జరిగి, బన్నీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. పవన్ సినిమాలో బాలనటిగా, పైగా ఆయన కూతురిగా నటించడమంటే ఎలాంటి గుర్తింపు వస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇలా నటించనుందన్న సమాచారంలో నిజమెంత అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే 'శాకుంతలం' సినిమాలో హీరోయిన్‌గా సమంత నటిస్తుండగా, ఈ మూవీలోనే సమంత పాత్రకు సంబంధించిన ఆమె చిన్నప్పటి పాత్రలో అల్లు అర్హ ఎంట్రీ ఇవ్వనుంది. ఇందుకు సంబంధించిన డబ్బింగ్ కూడా పూర్తయినట్టు తెలుస్తోంది.
Read more:
పవన్ అభిమానులను షాకిచ్చిన హరీష్ శంకర్!
Aishwarya Rai & Mahesh Babu :మహేష్ సినిమాలో నటించనున్న ఐశ్వర్యరాయ్