బన్నీ-స్నేహరెడ్డి లవ్ స్టోరీ ఎలా మొదలైంది.. ఫస్ట్ ఎలా లీక్ అయ్యిందో తెలుసా?

by Anjali |   ( Updated:2024-01-29 04:56:29.0  )
బన్నీ-స్నేహరెడ్డి లవ్ స్టోరీ ఎలా మొదలైంది.. ఫస్ట్ ఎలా లీక్ అయ్యిందో తెలుసా?
X

దిశ, సినిమా: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి సుపరిచితమే. ఈ హీరో ప్రస్తుతం ‘పుష్ప’ పార్ట్-2 చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రం కోసం బన్నీ ఫ్యాన్స్ అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మొన్నటి వరకు ఈ సినిమాలో అల్లు అర్జున్ ఫ్రెండ్ గా నటించిన కేశవ జైల్లో ఉండటంతో ఈ మూవీ షూటింగ్‌కు కాస్త బ్రేక్ పడింది. కేశవను చిత్ర బృందం బెయిల్ పై బయటకు తీసుకువచ్చి షూటింగ్ ప్రారంభించారు. ఇదంతా పక్కన పెడితే..

ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - స్నేహరెడ్డి ప్రేమ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. టాలీవుడ్‌లో బన్నీకి లవ్ ఎఫైర్స్ లాంటివి ఏం లేవనే చెప్పుకోవచ్చు. ఇప్పటికీ హీరోయిన్ల విషయంలో కూడా బన్నీపై ఎలాంటి రూమర్లు రాలేదు. కానీ బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె స్నేహరెడ్డిని ఇష్టపడ్డారు. ఇబ్రహీంపట్నానికి చెందిన స్నేహ ఓ ప్రైవేటు పార్టీలో కామన్ ఫ్రెండ్స్ ద్వారా అల్లు అర్జున్ తో పరిచయం ఏర్పడింది.

ఆ తర్వాత ఫోన్ నెంబర్లు తీసుకుని మాట్లాడుకున్నారు. ప్రేమలో పడ్డారు. కులం వేరు అయినప్పటికీ తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి ప్రేమను ఎవరికి చెప్పాలి.. స్నేహారెడ్డిని ఎలా పెళ్లి చేసుకోవాలని బన్నీ తనలో తానే సతమతమైపోయాడట. చివరకు తన తల్లికి తెలిపాడట. అమ్మాయి నీకు నచ్చితే నాకు ఓకేరా అని చెప్పిందట. ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ తల్లి.. అల్లు అరవింద్‌కు చెప్పిందట. ఆయన మొదట్లో కొప్పడగా.. తర్వాత బన్నీ-స్నేహ రెడ్డి పెళ్లికి అంగీకరించారట. ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story