- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అల్లు అర్జున్, సాయిపల్లవి కాంబోలో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా?
దిశ, సినిమా : టాలీవుడ్ న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ నటి మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంది. దీంతో అమ్మడుకు అవకాశాలు వరసగా వచ్చాయి. ఇక సాయిపల్లవి చాలా సింపుల్‌గా ఉండటమే కాకుండా, సినిమాల్లో కూడా ఎక్కువ బోల్డ్‌గా నటించదు. ఇక ఈ నటి ఎంతో మంది హీరోలతో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ముఖ్యంగా నాగచైతన్య, సాయిపల్లవి జంట ఫేయిర్ జోడిగా టాక్ తెచ్చుకుంది. వీరి కాంబోలో ఏ సినిమావచ్చినా అది హిట్ అందుకుంది.
అయితే సాయి పల్లవి, అల్లు అర్జున్ కాంబోలో మాత్రం ఒక్క సినిమా కూడా రాలేదు. కానీ వీరి కాంబోలో కూడా ఓ సినిమా వచ్చినా సాయిపల్లవి వలన అది ఒకే కాలేకపోయిందంట. ఇంతకీ అది ఏ సినిమా అనుకుంటున్నారా? పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్‌గా వచ్చిన పుష్ప సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో రష్మిక, అల్లుఅర్జున్ పాన్ ఇండియా లెవల్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు పార్ట్ 2 కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే మొదట ఈసినిమాలో హీరోయిన్‌గా సాయిపల్లవిని ఓ కే చేశారంట. కానీ ఇందులో రొమాంటిక్ సీన్స్ ఎక్కువగాఉంటాయని, కొన్ని సందర్భాల్లో ఎక్స్ పోజింగ్ చేయాలి అని చెప్పడంతో ఈ మూవీని సాయిపల్లవి వదులుకుంది. దీంతో ఈ ఆఫర్ రష్మికకు వచ్చేసిందంట. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.