- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్మగ్లర్ పాత్రకు నేషనల్ అవార్డా..! ట్రోలర్స్‌కు గట్టి సమాధానం ఇచ్చిన బన్నీ..!
దిశ, వెబ్‌డెస్క్: ‘పుష్ప ది రైజ్’ సినిమాతో అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు. దీంతో అల్లు అర్జున్‌కు ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. ‘పుష్ప’ సినిమాలో ఎర్రచందనం అక్రమ రవాణా చేసే పుష్పరాజ్ అనే స్మగ్లర్ పాత్రలో అల్లు అర్జున్ నటించిన విషయం తెలిసిందే. దీనికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావడంతో.. ‘స్మగ్లర్ పాత్రకు నేషనల్ అవార్డు ఎలా ఇస్తారు’ అంటూ నెట్టింట ట్రోల్స్ మొదలయ్యాయి.
అయితే.. ఈ ట్రోల్స్‌పై తాజాగా బన్నీ స్పందించారట. ‘నేషనల్, ఆస్కార్ అవార్డ్స్ అనేది నటుడి పర్ఫార్మెన్స్‌ను చూసి ఇస్తారు. బ్యాట్‌మెన్ లాంటి నెగెటివ్ క్యారెక్టర్‌కు ఆస్కార్ అవార్డు వచ్చింది. జంజీర్, అగ్నిపథ్ సినిమాల్లో అమితాబ్‌బచ్చన్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన డాన్ క్యారెక్టర్ చేశారు. ఆయన నటనకు నేషనల్ అవార్డులు వచ్చాయి. పుష్ప సినిమాలో నా నటననే పరిగణనలోకి తీసుకొని జాతీయ అవార్డు ఇచ్చారని అనుకుంటున్నా. అంతే కానీ కథానేపథ్యం, పాత్ర స్వభావం కాదని నా నమ్మకం’’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అల్లు అర్జున్ వ్యాఖ్యలు నెట్టింట హాట్ హాట్‌గా వైరల్ అవుతున్నాయి.