‘ఒరేయ్ నీకు పగులిద్ది’.. ముక్కు అవినాస్‌పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్

by Anjali |   ( Updated:2023-04-11 10:32:53.0  )
‘ఒరేయ్ నీకు పగులిద్ది’.. ముక్కు అవినాస్‌పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ముక్కు అవినాష్ గురించి తెలిసిందే. జబర్థస్త్‌లో తనదైన కమెడి టైమింగ్స్‌తో తెలుగు రాష్ట్రాల్లో పాపులారిటీ దక్కించుకున్న వారిలో అవినాష్ ఒకడు. తర్వాత బిగ్ బాస్‌లో ఎంట్రీ ఇచ్చి మరింత అభిమానులకు దగ్గరయ్యారు. ఇదిలా ఉంటే... తాజాగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అవినాష్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. ఇంతకి అవినాష్ చేసిన తప్పు ఏంటంటే..?

ఇటీవల అల్లు అర్జున్ బర్త్‌డే స్పెషల్‌గా.. పుష్ప-2 నుంచి ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆ పోస్టర్‌లో బన్ని అమ్మావారి రూపంలో ఊర మాస్‌ లుక్‌లో దర్శనమిచ్చాడు. అయితే.. అదే పోస్టర్‌ను ఎడిట్ చేస్తూ.. అవినాష్ బన్ని ఫేస్‌కు బదులు తన ఫేస్ పెట్టుకుని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఆ ఫోస్ట్ చూసిన బన్ని ఫ్యాన్స్ ‘‘ఆ లుక్‌లో అల్లు అర్జున్‌ని చూస్తే గంగమ్మ తల్లిలా ఉంది.. నిన్ను చూస్తే పక్కింటి మంగమ్మల ఉన్నావని’’ కొందరు కామెడీగా స్పందిస్తే.. మరికొందురు మాత్రం ‘‘ఒరేయ్ ఆ పోస్ట్‌ను అర్జెంట్‌గా డిలీట్ చెయ్యి లేదంటే నీకు పగులిద్ది’’ అంటూ సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. మరి దీనిపై అవినాష్ స్పందిస్తాడో లేదో చూడాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed