- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pawan Kalyan: ఆ నియోజకవర్గంలో జనసేన vs టీడీపీ.. రంగంలోకి డిప్యూటీ సీఎం
దిశ, వెబ్‌డెస్క్: ఏలూరు జిల్లా దెందులూరు నియోజవర్గ(Denduluru Constituency) కూటమిలో విభేదాలు బయటపడ్డాయి. జనసేన(Janasena), టీడీపీ(TDP) నాయకుల మధ్య వరుస ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. గురువారం రోజున పైడిచింతపాడులో టీడీపీ, జనసేన వర్గాలు మరోసారి గొడవ పడ్డాయి. దీంతో పోలీసులు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు. పరిస్థితి తీవ్రరూపం దాల్చుతుండటంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) రంగంలోకి దిగారు. నేడు దెందులూరులో పర్యటించనున్నారు. దెందులూరు(Denduluru) జనసేన పార్టీ ఇన్‌చార్జిని కలిసి సమస్యలు తెలుసుకోనున్నారు. పార్టీ నాయకులపై జరుగుతున్న వరుస దాడులపై చర్యలు తీసుకోవాలని జనసైనికులు పవన్ కల్యాణ్(Pawan Kalyan)ను రిక్వెస్ట్ చేయనున్నారు.
ఇదిలా ఉండగా.. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పైడిచింతపాడులో గురువారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. స్థానికంగా ఉన్న జనసేన మద్దతుదారు అయిన సర్పంచ్ కూటమిలో ఉన్న టీడీపీ నేతల్ని పిలవకుండా పెన్షన్ల పంపిణీ చేపట్టినట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య వివాదం చెలరేగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టారు. అలాగే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.