- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
TTD News: శ్రీవారి ఆలయంలో కన్నుల పండుగగా దీపావళి ఆస్థానం వేడుకలు
దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో దీపావళి పర్వదినం సందర్భంగా శాస్త్రోక్తంగా ఆస్థానం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆలయ అర్చకులు, తిరుమల జీయర్లు, టీటీడీ(TTD) ఉన్నతాధికారుల సమక్షంలో బంగారు వాకిలి వద్ద ఆగమోక్తంగా ఆస్థాన వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో జె. శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా దీపావళి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్ధించినట్లు చెప్పారు.
ఈ దీపావళి(Diwali) ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఈవో ఆకాంక్షించారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ భక్తులందరికీ శ్రీవారి ఆశీస్సులు అందాలని ఆకాంక్షిస్తూ దీపావళి ఆస్థానం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్వామి వారి మూలవిరాట్టుకి, ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాలు అలంకరించినట్లు చెప్పారు. తొలుత ఆలయంలో మూల మూర్తికి , ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాలు సమర్పించి రూపాయి హారతి, ప్రత్యేక హారతులను నివేదించారు. సాయంత్రం అమ్మవార్లు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు.