- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పండుగ పూట విషాదం..చేపల వేటకు వెళ్లి ఇద్దరు బాలురు గల్లంతు
దిశ,వలిగొండ : దీపావళి పండుగ పూట వలిగొండ పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గురువారం వలిగొండ-నాగారం గ్రామాల మధ్య ఉన్న మూసీనదిలో చేపలకు వెళ్లిన ఇద్దరు పిల్లలు, ప్రమాదవశాత్తు వరద నీటిలో మునిగి గల్లంతు అయ్యారు. ఒకరి మృతదేహం లభ్యం కాగా,మరొక బాలుని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. స్థానిక త్రిశక్తి ఆలయం పక్కన ఉన్న కాలనీలో నివాసం ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ముల కొడుకులు చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి చెందారు. కళ్లెం స్వామి సువర్ణ దంపతులకు ముగ్గురు బిడ్డలు ఒక కుమారుడు కిరణ్ చేపల వేటకు వెళ్లి నీటిలో మునిగి మృతి చెందాడు. కళ్లెం దశరథ అలివేలు దంపతులకు ఇద్దరు కొడుకులు,ఒక కూతురు పెద్ద కుమారుడు జీవన్ నీటిలో కొట్టుకపోయి ఆచూకీ దొరకకపోవడంతో తల్లిదండ్రుల రోధనలు మిన్నంటాయి.
కాలనీ యువకులు మూసీని గాలిస్తున్నారు. కళ్లెం సత్తయ్య పారిజాత దంపతుల కుమారుడు వరుణ్ కూడా వారితో పాటు వెళ్ళాడు. అతడు తెలిపిన వివరాలు కిరణ్ ముందుగా నీటిలో పడగా జీవన్ రక్షించేందుకు నీటిలో దుకగా నీటి ప్రవాహంలో ఇద్దరు నీటిలో మునిగారని వెంటనే పక్కన ఉన్న కాలనీవాసులకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా కిరణ్ మృతదేహాన్ని వెలికి తీశారు. జీవన్ కోసం గాలిస్తూనే ఉన్నారు. సంఘటన స్థలానికి స్థానిక ఎస్సై యుగేందర్ గౌడ్ చేరుకొని తన సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టి ఉన్నత అధికారులకు సమాచారం అందించగా చౌటుప్పల్ ఏసీపీ పట్లోళ్ల మధుసూదన్ రెడ్డి, రామన్నపేట సీఐ వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకొని సిబ్బందిని పిలిపించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మృతి చెందిన కిరణ్ మృతదేహాన్ని పంచనామ నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.