RBI Regulations: క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు బిగ్ షాక్.. RBI కొత్త నిబంధనలు!

by Shiva |
RBI Regulations: క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు బిగ్ షాక్.. RBI కొత్త నిబంధనలు!
X

దిశ, వెబ్‌డెస్క్: క్రెడిట్ కార్డ్ (Credit Card) వినియోగదారులకు ఆర్బీఐ (RBI) షాకిచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India) అనుబంధ సంస్థ ఎస్బీఐ కార్డ్ (SBI Card) కొత్త మార్పులను ప్రవేశపెట్టబోతోంది. క్రెడిట్ కార్డ్‌ (Credit Card)పై ఫైనాన్స్ ఛార్జీ నెలకు 3.75 శాతానికి పెంచబోతున్నట్లుగా ప్రకటించింది. బిల్లింగ్ వ్యవధిలో యూటిలిటీ పేమెంట్స్ (Utility Payments) మొత్తం రూ.50 వేలకు మించి ఉంటే 1 శాతం ఛార్జీ వేయనున్నారు. 2024 డిసెంబర్ 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. అదేవిధంగా ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) క్రెడిట్ కార్డ్ (Credit Card) రివార్డుల విషయంలో భారీ మార్పులు చేసింది. ఇన్సరెన్స్, కిరాణా షాపింగ్, ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, ఇంధన సర్‌చార్జ్ వంటి వాటిలో మినహాయింపులు, ఆలస్యమైన చెల్లింపు రుసుముల పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నియమం నవంబర్ 15 నుంచి అమల్లోకి రానుంది.

ఆర్బీఐ (RBI) వినియోగదారుల భద్రతను మరింత పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త దేశీయ నగదు బదిలీ ఫ్రేమ్‌ వర్క్‌ను ప్రకటించింది. ఇది నేటి నుంచి అమలులోకి వస్తుంది. ఆర్బీఐ (RBI) జులై 2024 సర్క్యులర్‌ ప్రకారం.. బ్యాంకింగ్ అవుట్‌లెట్‌ల లభ్యత, ఫండ్ బదిలీల కోసం చెల్లింపు వ్యవస్థలలో పురోగతి, కేవైసీ అవసరాలను తీర్చడం వాటిలో ఊహించని పెరుగుదల ఉందని ఆర్బీఐ తెలిపింది.

Advertisement

Next Story