Musi: మూసీ పునరుజ్జీవంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్

by Gantepaka Srikanth |   ( Updated:2024-11-01 05:50:43.0  )
Musi: మూసీ పునరుజ్జీవంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్
X

దిశ, వెబ్‌డెస్క్: మూసీ పునరుజ్జీవం(Musi Development)పై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే సచివాలయం వేదికగా అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. 15 రోజుల్లో గండిపేటలో గోదావరి నీళ్లు నింపేందుకు టెండర్లు పిలవడానికి చకచకా ఏర్పాట్లు చేస్తోంది. తొలి దశలో గండిపేట నుంచి బాపూఘాట్‌ వరకు పనులు ప్రారంభించనున్నారు. మూసీ పునరుజ్జీవంలో భాగంగా బాపూఘాట్‌ను అభివృద్ధి చేయనున్నది.

కాగా, మూసీ నదిలో ప్రవేశించే నీటిని శుద్ధి చేయడం ద్వారా నది ప్రక్షాళన చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రక్రియలో ఎస్టీపీలను రూ. 7 వేల కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. శుద్ధి చేసిన నీరు మూసీలో కలుస్తుండటంతో, ఈ నది కాలుష్యం తగ్గనుంది. దీని కోసం ఈ వారం లో టెండర్లను పిలవనుంది ప్రభుత్వం. ఇందుకు మల్లన్న సాగర్ నుండి ఉస్మాన్ సాగర్‌కు నీటిని తరలించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed