- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chintamaneni Prabhakar: ఈ విషయంపై పవన్ కల్యాణ్‌తో తప్పకుండా మాట్లాడుతా
దిశ, వెబ్‌డెస్క్: దెందులూరు(Denduluru) నియోజకవర్గంలో టీడీపీ, జనసేన పార్టీ నేతల మధ్య విభేదాలపై MLA చింతమనేని ప్రభాకర్(Chintamaneni Prabhakar) స్పందించారు. శుక్రవారం ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో ఆయన మాట్లాడారు. కొన్ని అరాచక శక్తులు ఇటీవలే జనసేనలో చేరాయని కీలక ఆరోపణలు చేరారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికే వాళ్లు పార్టీలో చేరారని ఆరోపించారు. చేరినవాళ్లు చేరినట్టు ఉంటే మంచిది. పెన్షన్ల పంపిణీతో వాళ్లకు సంబంధమేంటి? అని ప్రశ్నించారు. గ్రామాల్లో గొడవలు పెట్టే సంస్కృతి మానుకోవాలని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఆ రోజు కూటమి ఓటమికి ప్రయత్నించింది కూడా వారే అని అన్నారు. ఇప్పుడు పార్టీలో చేరి అధికారం చెలాయిస్తామంటే కుదరదు.
దీనిపై జనసేన(Janasena) అధినాయకత్వం(Pawan Kalyan)తో మాట్లాడుతామని చింతమనేని ప్రభాకర్ అన్నారు. కాగా, ఏలూరు జిల్లా దెందులూరు(Denduluru) నియోజకవర్గం పైడిచింతపాడులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. స్థానిక సర్పంచ్ కూటమిలో ఉన్న టీడీపీ నేతల్ని పిలవకుండా ఏకపక్షంగా పెన్షన్ల పంపిణీ చేపట్టినట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య వివాదం చెలరేగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టారు. అలాగే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.