Fish: చేప‌లు తినడం వలన ఆ సమస్య రాద‌ట‌.. షాకింగ్ నిజాలు వెల్లడించిన నిపుణులు

by Prasanna |
Fish: చేప‌లు తినడం వలన ఆ సమస్య రాద‌ట‌.. షాకింగ్ నిజాలు వెల్లడించిన నిపుణులు
X

దిశ, వెబ్ డెస్క్ : గత కొంత కాలం నుంచి చాలా మంది బర్డ్ ఫ్లూ వలన చికెన్ తినడం మానేశారు. అయితే, గుండె జబ్బుతో బాధపడేవారు చేపలు తింటే మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతో, అకస్మాత్తుగా వచ్చే హార్ట్ ఎటాక్ నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇక వారంలో రెండు సార్లు ఫిష్ తీసుకుంటే, మనిషి శరీరంలోని గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

కరోనా వచ్చి తర్వాత చాలా మంది గుండె పోటుతో మరణించారు. అయితే, ఎందువలన ఈ సమస్య వచ్చిందో ఇంతవరకు ఎలాంటి విషయాలు బయటకు రాలేదు. తీసుకునే ఫుడ్స్ వల్లే అంటూ కొందరి వాదన. కాబట్టి, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి, పోషకాహారాలు ఉన్న ఫుడ్స్ తీసుకుంటే.. గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని తమ పరిశోధకలు తెలిపారు. వారానికి మూడు రోజుల పాటు చేపల ఆహారం తీసుకుంటే, గుండె జబ్బు రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని డాక్టర్స్ కూడా చెప్పారు.

అయితే, ఎలాంటి చేపలు తీసుకుంటే.. ఆరోగ్యంగా ఉంటారనేది తాము పరిశోధనలు చేస్తున్నట్లు నిపుణులు వెల్లడించారు. అయితే, ప్రస్తుతం చేసిన పరిశోధనలను బట్టి చూస్తే.. చేపలను మీ రోజు వారి డైట్ లో తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటూ ఎలాంటి సమస్యల బారిన పడకుండా ఉంటారని ఆయన తెలిపారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Next Story

Most Viewed