- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Fire Accident : జగిత్యాలలోని బట్టల షాప్లో అగ్ని ప్రమాదం..
దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల పట్టణంలోని టవర్ సర్కిల్ ప్రాంతంలో గల అమ్మాజీ డ్రెస్సెస్ లో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదం కారణంగా సార్గమ్మ వీధిలో గల అమ్మాజీ డ్రెస్సెస్ కు చెందిన మూడు షెటర్స్ లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో షాపులో ఉన్న బట్టలు ఇతర సామాగ్రి కొంత నగదు కాలి బూడిద అయ్యాయి.
షాప్ యజమాని మాట్లాడుతూ సుమారు రూ. 30లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసాడు. ఈ ప్రమాదం పక్కన ఉన్న వారు టపాకాయలు కాల్చడం వల్లనే సంభవించిందని ఆరోపించాడు. టపాసులు కాల్చడం వల్ల షెటర్ సందు నుండి షాప్ లో కింద వేసిన కాటన్ పరుపులకు మంటలు అంటుకుని ప్రమాదం జరిగిందని తనకు జరిగిన నష్టానికి బాధ్యత ఎవరు వహిస్తారంటు ఆవేదన వ్యక్తం చేసాడు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడం తో ఇరుకు సందులో చుట్టూ ఉన్న బట్టల షాపులకు మంటలు వ్యాపించకపోవడం తో పెద్ద ప్రమాదం తప్పింది.