- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రత్యేక మండలం ఏర్పాటు కోసం రిలే నిరాహార దీక్షలు..గతంలో రెండు సార్లు చేసిన ఫలితం శూన్యం
దిశ, తలకొండపల్లి : రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండల పరిధిలోని గట్టు ఇప్పలపల్లి గ్రామాన్ని ప్రత్యేక మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని గతంలోనే రెండు సార్లు రిలే నిరాహార దీక్షలు చేసిన ఫలితం మాత్రం శూన్యం. గట్టు ఇప్పలపల్లి గ్రామం చాలా వెనుకబాటుకు గురైందని, ఏ రాజకీయ నాయకులు, అధికారులు కూడా మా గ్రామాన్ని పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా గ్రామం నుండి తలకొండపల్లి మండల కేంద్రానికి సుమారు 16 కిలోమీటర్ల దూరం ఉండటంవల్ల, ప్రతినిత్యం తమ తమ అవసరాలు నిమిత్తం మండల కేంద్రానికి చేరుకోవాలంటే సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడమే మాకు శాపంగా మారిందని, కనీసం మాకు ఏదైనా ఒక బ్యాంకు ఏర్పాటు చేయాలని గతంలో ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా ఎవరు కూడా పట్టించుకున్న పాపనుకోలేదని జేఏసీ నాయకులు వారి ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. 2020 సెప్టెంబర్ లో మొదటిసారి 39 రోజుల పాటు, 2023 జూలై 2 వ తేదీ నుంచి వంద రోజుల పాటు రెండవ సారి దీక్ష చేశారు.
రెండోసారి దీక్షలు చేపట్టిన సమయంలో 2023 అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో వెలువడడంతో పోలీసులు తప్పని పరిస్థితులలో దీక్షలను విరమింప చేయించారు. 2023 లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక మండలాలను ప్రకటిస్తున్న సమయంలో గట్టు ఇప్పలపల్లి గ్రామాన్ని కూడా ప్రత్యేక మండలంగా ప్రకటించాలని కోరుతూ స్థానిక సర్పంచ్ తో పాటు 12 మంది వార్డు సభ్యులతో పాలకవర్గం మొత్తం జేఏసీ నాయకులు పట్టు బట్టి రాజీనామా చేయించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమనగల్ బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కోరిక మేరకు నియోజకవర్గంలోని వెల్జాల్, గట్టు ఇప్పలపల్లి, రఘుపతిపేట గ్రామాలను ప్రత్యేక మండలంగా ప్రకటిస్తానని హామీ ఇప్పించారు. ఇప్పటికైనా మా ప్రాంతానికి చెందిన వ్యక్తి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో కనీసం మా ప్రాంత ప్రజల చిరకాల వాంఛ తీర్చాలని జేఏసీ నాయకులు కోరుతున్నారు. మొదటి రోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న నేతలు ముకురాల అశోక్ గౌడ్, ఏదుల శరత్ చంద్ర, ఆంజనేయులు గౌడ్, అనిల్ ,రాజు, యాదగిరి, ఆంజనేయులు, కృష్ణాజి ,చెన్నయ్య, నిరంజన్, తేజ, ప్రణయ్ కుమార్ తదితరులున్నారు.