Delhi Air Pollution: గ్యాస్ ఛాంబర్ గా ఢిల్లీ.. మరింత పడిపోయిన గాలి నాణ్యత

by Y.Nagarani |   ( Updated:2024-11-01 03:04:56.0  )
Delhi Air Pollution: గ్యాస్ ఛాంబర్ గా ఢిల్లీ.. మరింత పడిపోయిన గాలి నాణ్యత
X

దిశ, వెబ్ డెస్క్: ఊహించిందే జరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి తర్వాత గాలినాణ్యత (Delhi Air Quality) మరింత క్షీణించింది. పొగమేఘాలు ఆకాశాన్ని కమ్ముకోగా.. విషపూరితమైన గాలినే పీలుస్తున్నారు. దీపావళికి బాణసంచా కాల్చొద్దని ఎంత హెచ్చరించినా.. ప్రజలు పండుగకు పెద్దఎత్తున బాణసంచా కాల్చడంతో పొల్యూషన్ మరింత పెరిగింది. ఇప్పుడు ఢిల్లీ గ్యాస్ ఛాంబర్ (Gas Chamber) ను తలపిస్తోంది. ఉదయం 5.30 గంటలకు అక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI)700 కంటే ఎక్కువగా నమోదైంది. పలు ప్రాంతాల్లో పొగమంచుతో కలిసి కాలుష్యం కమ్ముకోవడంతో.. రోడ్లు కూడా సరిగ్గా కనిపించని పరిస్థితి నెలకొంది.

ఆనంద్ విహార్ లో - 714, సిరిఫోర్ట్ -480, గురుగ్రామ్ -185, డిఫెన్స్ కాలనీ -631, నోయిడా -332, షహదర -183, నజాఫ్ ఘర్ -282, పట్పర్గంజ్ -513 పాయింట్లకు గాలినాణ్యత పడిపోయింది. దీపావళికి (Diwali) ముందు 400 పైగా ఉన్న ఏక్యూఐ ఇప్పుడు 700 దాటడంతో శ్వాసకోశ సమస్యలున్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెట్టల దగ్ధం, వాహనాల నుంచి వెలువడే పొగ, దీపావళి క్రాకర్స్ కాలుష్యం కలిసి.. ఢిల్లీని డేంజర్ జోన్ లోకి నెట్టేసింది. 2016 నుంచి దీపావళి తర్వాత ఢిల్లీలో గాలినాణ్యత ఇలా ఉంది. 2016-431, 2017- 319, 2018-281, 2019- 337, 2020-414, 2021-382, 2022-312 పాయింట్ల ఏక్యూఐ నమోదైంది.

Advertisement

Next Story

Most Viewed