GUN: తుపాకీ క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్

by Gantepaka Srikanth |   ( Updated:2024-11-01 04:55:29.0  )
GUN: తుపాకీ క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం కలెక్టర్‌లో గన్(Gun) మిస్ ఫైర్ అయింది. క్లీన్ చేస్తుండగా ఒక్కసారిగా పేలింది. దీంతో క్లీన్ చేస్తున్న ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్(AR Head Constable) సుబ్బరాజు భూజానికి తీవ్రగాయం అయింది. గమనించిన కలెక్టరేట్ సిబ్బంది ఆయన్ను హుటిహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సుబ్బరాజు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. అయితే ఆ స‌మ‌యంలో చుట్టుపక్కల ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ప్రమాదం త‌ప్పింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story