- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
IND Vs NZ: మూడో టెస్ట్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్.. భారత జట్టులో ఒకే ఒక్క మార్పు
దిశ, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్ (New Zealand)తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఇప్పటికే టీమిండియా (Team India) 2-0 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. ముంబై (Mumbai)లోని వాంఖడే స్టేడియం (Wankhade Stadium) వేదికగా మూడో టెస్ట్ నేటి నుంచి ప్రారంభం అయింది. చివరి టెస్ట్‌లో ఎలాగైనా గెలిచి పరువు నిలుపుకోవాలని టీమిండియా (Team India) చూస్తుండగా.. న్యూజిలాండ్ (New Zealand) జట్టు వైట్‌వాష్ (White Wash)పై కన్నేసింది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ (Tom Latham) బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
అయితే, చివరి మ్యాచ్‌లో కవీస్ తుది జట్టులో రెండు మార్పులు చేసింది. మిచెల్ సాంట్నర్ (Michelle Santner) స్థానంలో ఇష్ సోధి (Ish Sodhi), టీమ్ సౌథి (Tim Southe) స్థానంలో మ్యాట్ హెన్రీ (Matt Henry) జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆతిథ్య జట్టు టీమిండియా (Team India) తుది జట్టులో ఒకే ఒక్క మార్పు చేసింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు (Jasprit Bumrah) విశ్రాంతినిచ్చి ఆ ప్లేస్‌లో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)ను జట్టులోకి తీసుకుంది. హెల్త్ బాగోలేకపోవడం వల్లే బుమ్రాను చివరి టెస్ట్‌లో ఆడించడం లేదని కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశారు. దీంతో భారత్ పేస్ బాధ్యతలను మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ మోయనున్నారు.
భారత జట్టు..
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(C), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(WK), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్
న్యూజిలాండ్ జట్టు..
టామ్ లాథమ్(C), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్(WK), గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి, మాట్ హెన్రీ, అజాజ్ పటేల్, విలియం ఒరూర్కే