- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ALLU ARHA: అద్భుతంగా డ్రాయింగేసిన అల్లు అర్హ.. ఏం ఫొటో గీసిందంటే? పిక్ వైరల్
దిశ, సినిమా: టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి క్యూటీ అర్హ గురించి స్పెషల్ గా చెప్పుకోనవసరం లేదు. బన్నీ సతీమణి స్నేహా రెడ్డి తరచూ అర్హ చిలిపి చేష్టలను సోషల్ మీడియాలో తమ అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. ఫొటోలు, వీడియోలు నెట్టింట షేర్ చేయగా.. ఫ్యాన్స్ క్యూట్ కామెంట్లతో ముంచెత్తుతారు. ఈ బుడ్డది ఇప్పటికే సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘శకుంతలం’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. ఈ సినిమాలో భరతుడి పాత్రలో కనిపించి అర్హ క్యూట్ క్యూట్ మాటలతో తెలుగు ప్రేక్షకుల్ని తెగ ఆకట్టుకుంది. కాగా ఈ మూవీ పెద్దగా హిట్ టాక్ తెచ్చుకోకున్నా అర్హ నటనకు మాత్రం పొగడ్తల వర్షం కురిపించారు.
శకుంతలం మూవీనే అర్హ మొదటి చిత్రం. తారక్ సినిమాలో కూడా అర్హ బాలనటిగా కనిపించనుందని సోషల్ మీడియాలో టాక్ వచ్చింది. మరీ ఎంతవరకు నిజమో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. ఇకపోతే అల్లు అర్జున్ గారాల పట్టి అదిరిపోయే డ్రాయింగ్ వేసినట్లు తెలుస్తోంది. ప్రకృతి అందాలను ఒక చాట్ లో గీసింది. అందులో నీరు పారుతున్నట్లు, పక్కన గ్రీనరీ ఎత్తైన కొండలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అల్లు వారసురాలు వేసిన డ్రాయింగ్ చూసి అల్లు ఫ్యాన్స్ తెగ ముచ్చటిపడిపోతున్నారు. ఈ పిక్‌ను తల్లి స్నేహా రెడ్డి ఇన్‌స్టాగ్ స్టోరీగా పెట్టి.. అభిమానులతో పంచుకుంది.