- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ప్రేమమ్ హీరోపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. షాక్ లో ఇండస్ట్రీ
దిశ, వెబ్ డెస్క్ : మలయాళ చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ మంటలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. జస్టిస్ హేమ కమిటీ తన నివేదిక ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత అనేక మంది నటీమణులు తమకు ఇండస్ట్రీలో జరిగిన వేధింపులను ధైర్యంగా బయట పెడుతున్నారు. తాజాగా ప్రేమమ్(Premam) మూవీ హీరో నివిన్ పౌలి తనను లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ ఓ నటి పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. తనకు సినిమాల్లో అవకాశాలు ఇస్తానని గత నవంబర్లో దుబాయ్ తీసుకువెళ్ళి, అక్కడ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఆరుగురిపై ఆ నటి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ జరిపి ఆరుగురి మీద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. కాగా ఈ కేసులో నివిన్ ఆరవ నిందితుడిగా ఉన్నాడు. ఓ ప్రముఖ నిర్మాత కూడా ఈ కేసులో ఉన్నట్టు సమాచారం. మలయాళ ప్రేమమ్ తో తెలుగు ప్రేక్షకుల మనసు కూడా దోచుకున్న నివిన్ కు ఇక్కడ భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు. కాగా ఈ వార్తా నెట్టింట్లో వైరల్ కాగా నివిన్ అభిమానులే కాక.. మలయాళ, తమిళ, తెలుగు ఇండస్ట్రీ కూడా షాక్ అయింది. ఇక ఇప్పటికే మలయాళంలో అనేకమంది ప్రముఖ దర్శకులు, నటుల పేర్లు కాస్టింగ్ కౌచ్ లో బయటికి వస్తూ రోజుకో సంచలన వార్త బయటికి వస్తోంది. అలాగే ఇతర పరిశ్రమల్లో కూడా జస్టిస్ హేమ లాంటి కమీషన్లు ఏర్పాటు చేయాలనే డిమాండ్స్ ఊపందుకుంటున్నాయి.