160 ఏళ్ల నాటి చీరలో అనంత్ అంబానీ పెళ్లికి హాజరైన అలియా భట్.. ఫొటోలు వైరల్

by Hamsa |
160 ఏళ్ల నాటి చీరలో అనంత్ అంబానీ పెళ్లికి హాజరైన అలియా భట్.. ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా: సోషల్ మీడియా మొత్తం గత కొద్ది రోజుల నుంచి ముఖేష్ అంబానీ ఇంట్లో జరుగుతున్న వేడుకల గురించే మాట్లాడుకుంటున్నారు. ఆయన చిన్న కొడుకు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి జూలై 12న జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకలకు ప్రపంచ నలుమూలల నుంచి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరై సందడి చేశారు. ఈ వేడుకలకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కూడా వెళ్ళింది.

అయితే ఇందులో ఈ అమ్మడు 160 ఏళ్ల నాటి చీరకట్టి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అలియా భట్ కట్టిన చీర 160 ఏళ్ల క్రితం నేసిన ఆవావళి చీర గుజరాత్‌లో స్వచ్ఛమైన పట్టును ఉపయోగించారని తెలుస్తోంది. అయితే అలియ చీరను 6 గ్రాముల బంగారంతో చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిని ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా తయారు చేశాడని సమాచారం. ప్రస్తుతం అలియా భట్ చీరకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమ్మడు అందాలకు నెటిజన్స్ మైమరచిపోతూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Advertisement

Next Story