Akira Nandan: డ్యాన్స్‌ ఇరగదీసిన అకీరా నందన్.. నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్ వీడియో

by Hamsa |   ( Updated:2024-08-19 11:46:27.0  )
Akira Nandan: డ్యాన్స్‌ ఇరగదీసిన అకీరా నందన్.. నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్ వీడియో
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రేణు దేశాయ్ తనయుడు అకీరా నందన్ అందరికీ సుపరిచితమే. పవన్, రేణు దేశాయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరికి అకీరా, ఆద్య అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీరి కాపురం బాగానే సాగినప్పటికీ మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక అప్పటి నుంచి పిల్లల భాద్యతలు రేణు దేశాయ్ తీసుకుని సినిమాలకు దూరం అయింది. పవన్ మాత్రం మరొ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కానీ పిల్లలు మాత్రం తల్లిదండ్రులిద్దరితో గడుపుతున్నారు.

ఇటీవల పవన్ డిప్యూటీ సీఎం అయిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి అకీరా తండ్రి పక్కనే కనిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా, అకీరా నందన్ చిన్నప్పుడు డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. సత్యాగ్రహి సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. కానీ అది మధ్యలోని ఆగిపోయినట్లు సమాచారం. అయితే ఈ సినిమా లాంచ్ ఈవెంట్ లో పవన్ ఫ్యామిలీతో పాల్గొన్నారు. ఈ సమయంలోనే అకీరా బంగారం మూవీ టైటిల్ సాంగ్‌కు డ్యాన్స్ చేసి దుమ్మురేపాడు. ఇక అకీరాను పవన్, రేణు దేశాయ్ ఆపినప్పటికీ ఆగకుండా స్టెప్పులేశాడు. ప్రస్తుతం అకీరాకు సంబంధించిన పాత వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు క్యూట్ అని కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed