ప్రభాస్ కల్కి సినిమాను థియేటర్‌లో చూడటానికి వెళ్లిన అకీరా నందన్ .. మెగా ఫ్యాన్స్ డబుల్ ఖుషీ

by Prasanna |   ( Updated:2024-06-27 14:08:18.0  )
ప్రభాస్ కల్కి సినిమాను థియేటర్‌లో చూడటానికి వెళ్లిన అకీరా నందన్ .. మెగా ఫ్యాన్స్ డబుల్ ఖుషీ
X

దిశ, సినిమా: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మూవీ ‘కల్కి’ 2898 AD ఈ రోజు థియేటర్స్‌లో రిలీజ్ అయింది. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ భారతీయ పురాణాలు, ఇతిహాసాల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో విష్ణువు పదవ అవతారంగా చెప్పబడే 'కల్కి' అవతారాన్ని నాగ్ అశ్విన్ చూపించారు.

ఇప్పటి వరకు అన్ని చోట్ల సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ నటన సినిమాకి ప్లస్ అయిందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాకి గొప్ప వీడియో దొరికింది. అదేంటో ఇక్కడ చూద్దాం..

పవన్ కల్యాణ్ తనయుడు అకిరానందన్‌ ప్రేక్షకుల మధ్యలో కూర్చొని ఐమాక్స్ లో సినిమా చూడటానికి వెళ్ళాడు. ఇప్పుడు ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నాయి. ప్రభాస్ సినిమా చూడటానికి అకీరా రావడంపై మెగా ఫ్యాన్స్ ఫ్యాన్స్‌ పండగ చేసుకున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ మెగా ఫ్యామిలీని చూసి అందరూ నేర్చుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed