జాగరణ చేసిన అకిరా, ఆద్య..స్పెషల్ వీడియో షేర్ చేసిన రేణు దేశాయ్

by Jakkula Samataha |
జాగరణ చేసిన అకిరా, ఆద్య..స్పెషల్ వీడియో షేర్ చేసిన రేణు దేశాయ్
X

దిశ, సినిమా : మహాశివరాత్రి రోజు భక్తులు ఆలయాలకు వెళ్లి ఆ పరమశివుడికి పూజలు చేస్తూ, ఉపవాసం, జాగరణ చేస్తారు. అయితే ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిల్లలు. అకిరా, ఆద్య శివరాత్రి సందర్భంగా ఉపవాసం ఉండటమే కాకుండా జాగరణ కూడా చేశారు.

తాజాగా రేణు దేశాయ్, పిల్లలకు సంబంధించిన స్పెషల్ వీడియోను తన అభిమానులతో పంచుకుంది. ఆ వీడియోలో, అకిరా, ఆద్య యోగా ముద్రలో కూర్చుని సద్గురు లైవ్‌ ని చూస్తు ఓం నమఃశివాయ అంటూ శివయ్య నామ స్మరణ చేస్తున్నారు.

అంతే కాకుండా వీరు శివరాత్రి రోజు ఎంతో నిష్టగా పూజలు చేసి, కేవలం మంచి నీరు మాత్రమే తాగి ఉపవాసం, జాగారం కూడా చేశారని రేణు దేశాయ్ తెలిపింది. ఇక ఇది చూసిన పవన్ ఫ్యాన్స్,రేణు దేశాయ్‌ని తెగ పొగిడేస్తున్నారు. పిల్లలని సరైన పద్ధతిలో పెంచుతున్నారని, అంతే కాకుండా మన ఆచారాలు, సంస్కృతి సంప్రదాయాల గురించి మీరు వారికి చెప్పే పద్ధతి,వారిని అదే విధానంలో పెంచడం చాలా బాగుంది అంటూ తెగ పొగిడేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడాకులు తీసుకొని విడి విడిగా ఉంటున్న విషయం తెలిసిందే. కానీ పిల్లలు మాత్రం మెగా ఫ్యామిలీకి దగ్గరగా ఉంటూ..ఏ చిన్ని పార్టీ జరిగినా వాటికి అటెండ్ అవుతుంటారు.


Advertisement

Next Story