హీరో అజిత్ ' విడాముయ‌ర్చి ' ఫస్ట్ లుక్ రిలీజ్.. అమేజింగ్ స్టైల్ కు ఫ్యాన్స్ ఫిదా..

by Sujitha Rachapalli |
హీరో అజిత్  విడాముయ‌ర్చి   ఫస్ట్ లుక్ రిలీజ్.. అమేజింగ్ స్టైల్ కు ఫ్యాన్స్ ఫిదా..
X

దిశ, సినిమా : అగ్ర క‌థానాయ‌కుడు అజిత్‌కుమార్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ క‌ల‌యిక‌లో మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ మూవీ ‘విడాముయ‌ర్చి’. ఈ క్రేజీ కాంబోలో సినిమా అన‌గానే అభిమానులు స‌హా అంద‌రిలో సినిమాపై భారీ అంచ‌నాలు మొద‌ల‌య్యాయి. అస‌లు సినిమాలో అజిత్ లుక్ ఎలా ఉంటుంది.. మూవీ ఎలా ఆక‌ట్టుకోనుందంటూ అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూడ‌సాగారు. ఆ స‌మ‌యం వ‌చ్చేసింది.. అంద‌రి అంచ‌నాల‌ను మించేలా ‘విడాముయ‌ర్చి’ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

డైరెక్టర్ మ‌గిళ్ తిరుమేని దర్శకత్వంలో వస్తున్న సినిమాలో త్రిష, యాక్షన్ కింగ్ అర్జున్, రెజీనా, నిఖిల్ ప్రధాన పాత్రలలో కనించబోతున్నారు. ఇక ఈ సంద‌ర్భంగా లైకా ప్రొడ‌క్ష‌న్స్ హెడ్ జి.కె.ఎం.త‌మిళ్ కుమ‌ర‌న్ మాట్లాడుతూ ‘‘మా బ్యానర్‌లో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా విడాముయ‌ర్చి చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను ఇప్పుడు విడుద‌ల చేయ‌టం మా అంద‌రికీ ఎంతో ఆనందంగా ఉంది. అజిత్‌తో సినిమా చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి అభిమానులు, ప్రేక్ష‌కులు వారి స‌పోర్ట్‌ను అందిస్తున్నారు. వారికి చ‌క్క‌టి సినిమాను అందించ‌టమే మా ల‌క్ష్యం. అందుక‌నే మా టీమ్ ఎంత‌గానో క‌ష్ట‌ప‌డుతుంది. ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఆగ‌స్ట్ నెల‌లో సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేస్తాం. త‌ర్వాతే సినిమా రిలీజ్ ఎప్పుడు ఉంటుంద‌నే దాని గురించి అధికారికంగా తెలియ‌జేస్తాం’’ అన్నారు. కాగా కోలీవుడ్ మ్యూజిక‌ల్ రాక్ స్టార్ అనిరుద్ ఇప్ప‌టికే చార్ట్‌బ‌స్ట‌ర్ ఆల్బ‌మ్‌ను సిద్ధం చేశారు. ఇక ఈ చిత్రం శాటిలైట్ హ‌క్కుల‌ను స‌న్ టీవీ సొంతం చేసుకోగా, ఓటీటీ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకుంది.


Advertisement

Next Story

Most Viewed