Ponguleti Srinivas Reddy: ఒకట్రెండు రోజుల్లో సీఎంకు సియోల్ టూర్ రిపోర్టు: మంత్రి పొంగులేటి

by Prasad Jukanti |   ( Updated:2024-10-25 11:57:11.0  )
Ponguleti Srinivas Reddy: ఒకట్రెండు రోజుల్లో సీఎంకు సియోల్ టూర్ రిపోర్టు: మంత్రి పొంగులేటి
X

దిశ, డైనమిక్ బ్యూరో: పేదల విషయంలో రాజకీయాలు వద్దని, పేదలను అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలని చూడవద్దని ప్రతిపక్షాలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) సూచించారు. మంచి చేసే విషయంలో సూచనలు చేయండి.. మా పనుల్లో ఏదైనా పొరపాట్లు ఉంటే చెప్పాలన్నారు. దక్షిణ కొరియా (South Korea) రాజధాని సియోల్ (Seoul) పట్టణంలో హన్ నది పునరుజ్జీవన ప్రాజెక్టును పరిశీలించేందుకు వెళ్లిన మంత్రులు, అధికారులు బృందం శుక్రవారం తిరిగి తెలంగాణకు చేరుకున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి (Vem Narender Reddy) తదితరులతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మూసీ పునర్జీవం చేసి తీరుతామని, మూసీ నిర్వాసితులకు మంచి జీవితం ఇస్తామని మంత్రులు చెప్పారు. లక్షలాది మంది కుటుంబాలకు ఈ ప్రభుత్వం భరోసా ఇస్తోందని సియోల్ లో ఒకప్పుడు మన మూసీ (Musi) కంటే ఎక్కువ మురుగు ఉండేదని వాళ్లు అద్భుతంగా సియోల్ నదిని ప్రక్షాళన చేశారని చెప్పారు. సియోల్ లోని పరిస్థితులను పరిశీలించి వచ్చామన్నారు. అక్కడ ఉన్న స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్స్ సిటీ, వ్యర్థాల నిర్వహాణ, ఎస్టీపీలు పరిశీలించామన్నారు. తాము పరిశీలించిన అంశాలపై ఒకటి రెండు రోజుల్లో ముఖ్యమంత్రికి, రాష్ట్ర కేబినెట్ కు రిపోర్టు ఇస్తామన్నారు.

Advertisement

Next Story