‘ఆదిపురుష్’ న్యూ పోస్టర్‌ రిలీజ్.. అభిమానుల రియాక్షన్ ఇదే..!

by sudharani |   ( Updated:2023-05-01 08:13:43.0  )
‘ఆదిపురుష్’ న్యూ పోస్టర్‌ రిలీజ్.. అభిమానుల రియాక్షన్ ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘ఆదిపురుష్’. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కథనాయికగా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్‌పై పలు వివాదాలు వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ సినిమాలో మార్పులు చేస్తూ.. సరికొత్తగా తీర్చిదిద్దే పనిలో పడ్డారు మూవీ మేకర్స్. ఈ క్రమంలో మరో సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

సీతమ్మ అయిన కృతి సనన్ నయా లుక్‌ను రిలీజ్ చేస్తూ ‘‘అమరం, అఖిలం ఈ నామం, సీతారాముల ప్రియ నామం’’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అయితే దీనిపై అభిమానుల రియాక్షన్ ఎలా ఉందంటే.. ‘బ్లాక్‌బస్టర్ లోడింగ’ అని ఒకరు, ‘ఇప్పటి వరకు మీ యొక్క ఉత్తమ పోస్టర్’ అంటూ మరో అభిమాని రిప్లై ఇచ్చారు. అంతే కాకుండా.. ‘‘ఇదే కదా మాకు కావాల్సింది. ఇదే స్పీడ్‌లో ట్రైలర్‌ కూడా దింపు’’అంటూ పాజిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు.

Advertisement

Next Story