- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
ఆయన ఇంట్లోనే ఉంటా.. ఏం చేసుకుంటారో చేసుకోండి.. ఓపెన్‌గా చెప్పేసిన ఆదా శర్మ
దిశ, సినిమా : బ్యూటిఫుల్ ఆదా శర్మ ‘ది కేరళ స్టోరీ’తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చేసింది. కాంట్రవర్షియల్ రోల్స్ ప్లే చేస్తూ అదుర్స్ అనిపించిన ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో కుక్కలు, పిల్లులతో ఆడుకుంటూ వెరైటీ వీడియోస్ షేర్ చేస్తుంది. ఎప్పుడు సాదాసీదాగా ఉండాలనుకునే ఆదా.. రీసెంట్గా వంద రూపాయల చీర ధరించి వావ్ అనిపించింది. ఇదిలా ఉంటే గతంలో లేట్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బంగ్లా కొనుగోలు చేసినప్పుడు వచ్చిన మీడియా అటెన్షన్‌పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయింది.
‘నేను అందరి మనసులో ఉండాలని అనుకుంటాను.దీని గురించి మాట్లాడేందుకు ఇదే రైట్ టైమ్. నేను ఆ ప్లేస్ చూడడానికి వెళ్లినప్పుడు మీడియా అత్యుత్సాహం చూసి షాక్ అయ్యా.నేను ప్రైవేట్ పర్సన్‌ను. మూవీస్ ద్వారా వచ్చే గుర్తింపుతో అందరి దృష్టిలో ఉండాలనుకుంటాను. కానీ ఇలా కాదు. పైగా చనిపోయిన వ్యక్తి బంగ్లా కొంటే అశుభం జరుగుతుందని మాట్లాడుతున్నారు కొందరు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి రిమార్కబుల్ ఫిల్మ్స్ అందించిన సుశాంత్ గురించి అలా మాట్లాడటం చాలా తప్పు’ అని చెప్పుకొచ్చింది.