నటి వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి హడావిడి షురూ.. నెట్టింట ఫొటోలు వైరల్‌!

by Kavitha |
నటి వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి హడావిడి షురూ.. నెట్టింట ఫొటోలు వైరల్‌!
X

దిశ, సినిమా: ‘హనుమాన్’ సినిమాతో హిట్ కొట్టిన నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. మూవీ హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా అన్ని మూవీలలో నటిస్తుంది. ఇక ముంబైకి చెందిన వ్యాపారవేత్త నికోలయ్ సచ్‌దేవ్‌తో దాదాపు ఏడేళ్ల నుంచి ప్రేమలో ఉన్నది. ఇక రీసెంట్‌గానే పెద్దలను ఒప్పించి ఎంగేజ్మెంట్ చేసుకుని షాక్ ఇచ్చింది నటి వరలక్ష్మి. అయితే జూలై 2న థాయ్‌లాండ్‌లో గ్రాండ్‌గా పెళ్లి చేసుకోబోతున్న ఈ అమ్మడు ఇప్పటికే దక్షిణాది సెలబ్రిటీలకు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి తన పెళ్లి పత్రిక పంచుతూ తన పెళ్లికి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే ప్రస్తుతం వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకున్నారు. వాటిలోని ఒక ఫొటోలో కాబోయే భర్త నికోలయ్‌ సచ్‌దేవ్‌ను హగ్ చేసుకుంటూ కనిపించారు. కాగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ముంబైలో జరిగినట్లు తెలిసింది. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు అడ్వాన్స్ కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు.


Next Story

Most Viewed