ఆదిలాబాద్ మున్సిపల్ అవిశ్వాసానికి తేదీ ఖరారు

by Mahesh |
ఆదిలాబాద్ మున్సిపల్ అవిశ్వాసానికి తేదీ ఖరారు
X

దిశ, ఆదిలాబాద్: గత కొన్ని రోజులుగా ఆదిలాబాద్ జిల్లాలో చర్చనీయాంశంగా మారిన ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన ప్రత్యేక సమావేశం నిర్మాణ తేదీ ఖరారైంది. ఈ నెల 18వ తేదీ సమావేశాన్ని నిర్వహించాలని కోరుకుంటూ జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అందుకు సంబంధించిన మున్సిపల్ యంత్రాంగం తగు కసరత్తు చేస్తుంది. ఇదిలా ఉంటే అధికార విపక్ష బిఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్ గూటికి చేరేందుకు సమయత్తం అవుతుండటంతో ఆదిలాబాద్‌లో రాజకీయంగా వేడిని రగిలిస్తోంది. ఇప్పటికే ఇద్దరు కౌన్సిలర్ చేజారి పోగా, సంతకాలు పెట్టిన వారిలో మరో నలుగురు కాంగ్రెస్ గూటికి చేరనుండటంతో అవిశ్వాసం వీగిపోనిందని అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుంది. అయితే అవిశ్వాసం తేదీ వరకు సంతకాలు పెట్టిన కౌన్సిలర్లు మరింత మంది చేజారిపోనున్నారని వినికిడి నేపథ్యంలో విపక్ష బీఆర్ఎస్‌లో గుబులు రేగుతోంది.

వైస్ చైర్మన్‌ను ఎలాగైనా పదవిచ్చినం చేయాలనే ఉద్దేశంతో ఓ ప్రజాప్రతినిధి వేసిన పాచిక పారకపోవడంపై ఆ పార్టీలో ఆందోళన వ్యక్తం అవుతుంది. రాజకీయంగా ఇప్పటికే పదవి కోల్పోయిన సదర్ నేతకు రాజకీయంగా ఇది మరో ఎదురు దెబ్బ కానుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కాగా దీన్ని సవాల్ గా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ఈ అవిశ్వాసాన్ని నెగ్గించుకోవడంలో తన బలాన్ని నిరూపించుకోవాలని తహతహలాడుతుండటంతో రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బిఆర్ఎస్ నుంచి వైస్ చైర్మన్ హోదాలో జహీర్ రంజాన్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆదిలాబాద్‌లో మునిసిపల్ రాజకీయం రోజురోజుకు రసవత్తరంగా మారింది. ఒకపక్క బిఆర్ఎస్ నుంచి అధికార పార్టీలోకి వలసలు కొనసాగుతుండగా బిఆర్ఎస్, బీజేపీలో అవిశ్వాసం పై మొగ్గు చూపుతున్నడంతో ఎవరు నెగ్గుతారని సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

Next Story