రిషి సునాక్ గెలిచేనా ? ఇంకొన్ని గంటల్లో బ్రిటన్ ఎన్నికల ఫలితం

by Hajipasha |
రిషి సునాక్ గెలిచేనా  ? ఇంకొన్ని గంటల్లో బ్రిటన్ ఎన్నికల ఫలితం
X

దిశ, నేషనల్ బ్యూరో : బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత ప్రధానమంత్రి రిషి సునాక్ ప్రాతినిధ్యం వహిస్తున్న కన్జర్వేటివ్‌ పార్టీకి ఓటమి తప్పదని పలు సర్వే నివేదికలు చెబుతున్నాయి. గత 14 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న లేబర్ పార్టీకి ఈసారి ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. వాస్తవ ఫలితం అనేది భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 5 గంటల్లోగా తెలిసిపోతుంది. మన దేశ కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి సమయానికి (బ్రిటన్‌లో రాత్రి 7 గంటలు) కూడా అక్కడ ఓటింగ్ జరుగుతూనే ఉంది. అక్కడి టైం ప్రకారం.. రాత్రి 10 గంటల వరకు పోలింగ్‌ను కంటిన్యూ చేస్తారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడతాయి. మొత్తం 650 పార్లమెంటు స్థానాల్లో కన్జర్వేటివ్, లేబర్ పార్టీలు ఎన్నెన్ని గెలుచుకునే అవకాశాలు ఉన్నాయనే దానిపై సర్వే సంస్థలు తమ నివేదికలను రిలీజ్ చేస్తాయి. ఇక పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.

Next Story

Most Viewed