అడ్డా కూలీలతో రాహుల్‌గాంధీ మాటామంతీ

by Hajipasha |
అడ్డా కూలీలతో రాహుల్‌గాంధీ మాటామంతీ
X

దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం ఢిల్లీలోని గురుతేజ్ బహదూర్ నగర్‌లో అడ్డా కూలీలను కలిశారు. వారితో ఆప్యాయంగా మాట్లాడి, కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. అడ్డా కూలీలతో కలిసి భవన నిర్మాణ పనులు కూడా చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను రాహుల్ గాంధీ తన వాట్సాప్ ఛానల్‌లో షేర్ చేశారు. ‘‘దేశంలో కూలీలు, శ్రామికులకు గౌరవం లేకుండాపోయింది. ఇది చాలా బాధాకరమైన అంశం. అడ్డా కూలీలకు సంపూర్ణ హక్కులను కల్పించి, వారికి తగిన గౌరవం అందించడమే నా జీవిత లక్ష్యం’’ అని రాహుల్ ప్రకటించారు. ‘‘నిత్యావసరాల ధరలు బాగా పెరిగాయి. దీంతో వచ్చే కొద్దిపాటి వేతనంతో వాళ్లు అర్ధాకలితో జీవిస్తున్నారు. ఆ ఆదాయానికి కూడా భరోసా లేదు’’ అని ఆయన పేర్కొన్నారు. కష్టజీవులైన ఈ కార్మికులే భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలు అని తెలిపారు. ఈమేరకు కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేసింది. కార్మికుల జీవితాలకు, వారి భవిష్యత్తుకు భద్రత కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపింది.

Next Story

Most Viewed