ఫస్ట్ నైట్‌ను వ్లాగ్ చేసి నెట్టింట షేర్ చేసిన కొత్త జంట.. షాక్‌లో నెటిజన్లు!

by Hamsa |   ( Updated:2024-07-07 12:52:56.0  )
ఫస్ట్ నైట్‌ను వ్లాగ్ చేసి నెట్టింట షేర్ చేసిన కొత్త జంట.. షాక్‌లో నెటిజన్లు!
X

దిశ, సినిమా: ఇటీవల కాలంలో టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పక్క పక్కనే ఉన్నప్పటికీ మనుషుల మధ్య మాటలు బంద్ అయి ఫోన్ ద్వారా చాటింగ్ చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. అలాగే ఒకప్పుడు నలుగురు ఒక దగ్గర కలిస్తే రచ్చ రచ్చ చేసేవారు. కానీ స్మార్ట్ ఫోన్ వచ్చాక.. ఎవరి ఫోన్ వారు చూసుకుంటూ అందులో లీనమై పోతున్నారు. మరీ ముఖ్యంగా ఎక్కడికి వెళ్లినా రీల్స్ చేస్తూ వాటిని నెట్టింట షేర్ చేసి యూజర్స్‌ను ఆకట్టుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. రీల్స్, వ్లాగ్స్ కోసం కొందరు ప్రాణాలు సైతం లెక్క చేయడం లేదు. కొందరు తమ టాలెంట్ భయపెడుతూ డబ్బులు, మంచి హోదా సంపాదించుకుంటున్నారు. కానీ కొందరు మాత్రం ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. అలాగే ప్రమాదాలను కొని తెచ్చుకుని ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ కొందరు మారడం లేదు.

తాజాగా, కొత్తగా పెళ్లైన జంట ఏకంగా ఫస్ట్ నైట్ రోజు వీడియో చేసి నెట్టింట షేర్ చేశారు. అందులో అబ్బాయి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా శోభనం జరగబోతుంది. మంచాన్ని పూలతో ఎంతో అందంగా అలంకరించారు అని చెప్పి భార్యను పిలుస్తాడు. ఇక ఆమె హాయ్ ఫ్రెండ్స్ అంటుంది.. ఆ తర్వాత నా వైఫ్‌ను చాలా ప్రేమిస్తున్నాను అని ముద్దు పెడతాడు. అలాగే ఆమె ముక్కుపుడక పెట్టుకుని వస్తుంది. ఇది పెట్టుకోమని ఎవరు చెప్పారు అని భర్త అడగ్గా వదిన అని చెప్తుంది. అవునా అయితే నువ్వు బెడ్ మీద కూర్చో అని అంటాడు దాంతో వీడియో అయిపోతుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు షాక్ అవుతూ నాలుగు గోడల మధ్య జరగాల్సిన తతంగం అంతా సోషల్ మీడియాలో పెట్టేశారు అని అంటున్నారు. అలాగే పిచ్చి పీక్స్‌కు వెళ్లిందని కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed