ఆకాశమే హద్దుగా చెలరేగిన అభిషేక్.. జింబాబ్వేపై భారత్ భారీ స్కోర్

by Satheesh |   ( Updated:2024-07-07 12:45:42.0  )
ఆకాశమే హద్దుగా చెలరేగిన అభిషేక్.. జింబాబ్వేపై భారత్ భారీ స్కోర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐదు మ్యాచుల టీ-20 సిరీస్‌లో భాగంగా హరారే స్టేడియం వేదికగా జింబాబ్వేతో జరుగుతోన్న మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. సిరీస్ తొలి మ్యాచులో ఓడిన కసితో ఉన్న భారత ఆటగాళ్లు బ్యాటు ఝులిపించారు. హరారే స్టేడియంలో బ్యాటర్స్ పరుగుల వరద పారించడంతో టీమిండియా 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లో రెండు వికెట్ల నష్టానికి 234 రన్స్ చేసింది. కెప్టెన్ శుభమన్ గిల్ (2) మరోసారి నిరాశపర్చాడు. 4 బంతుల్లో కేవలం 2 పరుగులు మాత్రమే చేసి క్యాచ్ ఔట్ అయ్యాడు.

మరో యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. జింబ్వాబే బౌలర్లను ఊచకోత కోస్తూ కేవలం 47 బంతుల్లోనే మెరుపు సెంచరీ (100) చేసి భారత్‌ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. రుతురాజ్ గైక్వాడ్ 47 బంతుల్లో 77 రన్స్ చేసి ఆకట్టుకోగా.. చివర్లో యంగ్ సంచలనం రింకూ సింగ్ 22 బంతుల్లోనే 48 పరుగులు బాదడంతో భారత్ 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. జింబాబ్వే బౌలర్లలో ముజారబానీ, సికిందర్జా చెరో వికెట్ తీశారు. అనంతరం జింబాబ్వే 235 పరుగుల భారీ టార్గెట్‌తో ఛేజింగ్‌కు దిగింది. కాగా, ఐదు మ్యాచులో సిరీస్‌లో తొలి మ్యాచులో అనుహ్య విజయం సాధించి జింబాబ్వే భారత్‌కు బిగ్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed