‘నీట్‌’ను రద్దు చేయొద్దు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన 56 మంది ర్యాంకర్లు

by Hajipasha |
‘నీట్‌’ను రద్దు చేయొద్దు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన 56 మంది ర్యాంకర్లు
X

దిశ, నేషనల్ బ్యూరో : నీట్‌-యూజీ పరీక్షలో చోటుచేసుకున్న అవకతవకలపై దాఖలైన 26 పిటిషన్లను ఈనెల 8న సుప్రీంకోర్టు విచారించనున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నీట్‌ పరీక్షను రద్దు చేయకుండా కేంద్ర ప్రభుత్వంతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)ని ఆదేశించాలంటూ 56 మంది నీట్‌ ర్యాంకర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ‘‘నీట్ పరీక్షను రద్దు చేస్తే నిజాయతీగా కష్టపడి చదివిన విద్యార్థులకు నష్టం కలుగుతుంది. అది విద్యాహక్కు ఉల్లంఘనకు దారితీస్తుంది’’అని పిటిషనర్లు పేర్కొన్నారు. గుజరాత్‌కు చెందిన సిద్ధార్థ్‌ కోమల్‌ సింగ్లాతో పాటు మరో 55 మంది విద్యార్థులు సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌ వేశారు. మే 5న జరిగిన నీట్-యూజీ పరీక్షలో అవకతవకలకు పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖను ఆదేశించాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed