బీఎస్‌ఎఫ్ జవాన్లపై బంగ్లాదేశ్ స్మగ్లర్ల దాడి..తిప్పికొట్టిన బలగాలు

by vinod kumar |
బీఎస్‌ఎఫ్ జవాన్లపై బంగ్లాదేశ్ స్మగ్లర్ల దాడి..తిప్పికొట్టిన బలగాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌ నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని సరిహద్దు ఔట్‌పోస్టు సమీపంలో బీఎస్‌ఎఫ్ జవాన్లపై బంగ్లాదేశ్ స్మగ్లర్లు సోమవారం అర్ధరాత్రి దాడి చేశారు. ఐదో బెటాలియన్‌కు చెందిన జవాన్లు విధుల్లో ఉండగా వారిపై అటాక్‌కు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన జవాన్లు స్మగ్లర్లపై కాల్పులు జరిపారు. ఖరార్‌మఠ్ మరియు పిప్లీ సరిహద్దు ఔట్‌పోస్ట్ మధ్య బంగారం అక్రమ రవాణా జరిగే అవకాశం ఉందనే సమాచారంతో జవాన్లు కంచె ముందు సెక్యురిటీ ఉన్నారు. దీంతో నలుగురు స్మగ్లర్లు కంచె వైపు వేగంగా వెళ్లడాన్ని గమనించారు. వారిని అడ్డుకోగా వెంటనే దాడికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే జవాన్లు కాల్పులు జరపడంతో బంగ్లాదేశ్‌కు పారిపోయారు. కాల్పులుకు భయపడి ఓ స్మగ్లర్ ఇచ్చమతి నదిలో దూకినట్టు తెలుస్తోంది. అనంతరం ఘటనా స్థలంలో సోదాలు నిర్వహించిన బీఎస్ఎఫ్ పలు ఆయుధాలు స్వాధీనం చేసుకుంది. కాగా, ఇటీవల బంగ్లా సరిహద్దులో ఇటువంటి ఘటనలు తరచూ చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed