9 మంది సీఐలు, ఐదుగురు ఎస్ఐల బదిలీలు

by Mahesh |
9 మంది సీఐలు, ఐదుగురు ఎస్ఐల బదిలీలు
X

దిశ, హనుమకొండ టౌన్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 9మంది ఇన్స్ స్పెక్టర్‌లు, 5గురు ఎస్. ఐ‌లను వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేస్తూ మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్స్పెక్టర్లు ఆర్. సంతోష్ వరంగల్ కమాండ్ కంట్రోల్ నుండి ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కు, వి. క్రాంతి కుమార్ ను ఆత్మకూర్ నుండి పరకాలకు, డి. రవి రాజు పరకాల నుండి వి ఆర్ వరంగల్ కి, జీ. బాబు లాల్ వి ఆర్ వరంగల్ నుంచి గీసుకొండ కు, ఎల్. పవన్ కుమార్ గీసుకొండ నుంచి వరంగల్ టాస్క్ ఫోర్స్ కు, ఏ. సువర్ణ వి ఆర్ వరంగల్ నుండి సుబేదారి కి, ఎన్. కరుణాకర్ సుబేదారి నుండి సి సి ఆర్ బీ వరంగల్ కు, కె. రామకృష్ణ వి ఆర్ వరంగల్ నుంచి వరంగల్ ట్రాఫిక్ కు, కె. శ్రీధర్ వరంగల్ ట్రాఫిక్ నుంచి వరంగల్ టాస్క్ ఫోర్స్ కు బదిలీలు జరిగాయి. ఐదుగురు ఎస్ ఐ లు ఎస్. వెంకన్న గీసుకొండ పోలీస్ స్టేషన్ నుంచి వరంగల్ వి ఆర్ కు, జీ. రాజేష్ రెడ్డి ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ నుంచి వరంగల్ వి ఆర్ కు, ఎన్. చెన్నకేశవులు దేవరుప్పుల పోలీస్ స్టేషన్ నుండి, జనగామ కు , పి. శ్రీనివాస్ హనుమకొండ పోలీస్ స్టేషన్ నుంచి, వరంగల్ వి ఆర్ కు, జీ. అనిల్ కుమార్ ఐనవోలు పోలీస్ స్టేషన్ నుండి, వరంగల్ వి ఆర్ కు, బాధాలీలు జరిగాయి.

Next Story