యాంకర్ సుమకు డబ్బు పిచ్చి.. షాకింగ్ నిజం బయటపెట్టిన హీరోయిన్!

by Jakkula Samataha |
యాంకర్ సుమకు డబ్బు పిచ్చి.. షాకింగ్ నిజం బయటపెట్టిన హీరోయిన్!
X

దిశ, సినిమా : యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యాంకరింగ్‌లో ఆమెకు మించిన తోపులేరన్నది వాస్తవం. చాలా మందికి ఈ యాంకరింగ్ అంటే ఇష్టం ఉంటుంది. అంతే కాకుండా ఏ చిన్న ఈవెంట్, ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగినా సరే స్టార్ హీరోలు సైతం సుమనే ఉండాలని కోరుకుంటారు. అంతే కాకుండా ఈమె కోసం కొంత మంది తమ ఈవెంట్ డేట్ చేంజ్ చేసుకున్న రోజులు కూడా ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు.

ఇక ప్రస్తుతం సుమ ఈటీవీలో షోలు, ఈవెంట్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది. ఈ క్రమంలోనే ఈమెకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే? ఈటీవీలో ప్రసారమయ్యే సుమ అడ్డా శనివారం కాకుండా ప్రతి మంగళవారం ప్రసారం కానున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా ఈ మార్పులు చేర్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో సుమ అడ్డాకు లవ్ మీ టీం వచ్చి తమ కామెడీ, ఆట తీరుతో ఆకట్టుకుంది. అయితే ఈ షో ప్రోమోలో సుమ ఆంజనేయ స్వామికి పూజలు చేస్తుంది. ఇందులో సుమ హనుమాన్‌తో మాట్లాడుతూ కనిపిస్తుంది. అయితే స్వామి వారు సుమని, ఏంటమ్మా నువ్వు వెంకటేశ్వర స్వామి దగ్గర కదా ఉండాల్సింది అని అడుగుతారు. ఇక నుంచి మీ దయతో మంగళవారం ఎంటర్టైన్మెంట్ అందిద్దాం అనుకుంటున్నా స్వామి, మీ ఆశీస్సులు కావాలి అని అడుగుతుంది. తధాస్తు అని ఆంజనేయ స్వామి అంటారు. తర్వాత అంతే కాదు స్వామి ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సక్సెస్ సెలబ్రేషన్స్ అన్నీ నాకే వచ్చేలా చూడండి అని అడుగుతుంది. దీంతో స్వామి నా చేతిలో ఏం ఉంది అమ్మ అని అడగ్గా, గద అని చెప్తుంది. దీంతో స్వామి వారు..అది ఇచ్చుకు కొడతా అని వార్నింగ్ ఇస్తారు. ఇలా ఫన్నీగా ఈ ప్రోమో సాగుతోంది. అయితే ఇందులో సుమ దెయ్యాలు నైట టైం మాత్రమే ఎందుకు తిరుగుతాయని చెప్పగా, వైష్ణవి అవి పగలంతా షోలు, ఈవెంట్స్ చేసి బిజీగా ఉంటాయని చెప్తుంది. దీంతో ఇది చూసిన నెటిజన్స్, వైష్ణవి సుమకి ఇన్ డైరెక్ట్‌గా గట్టి కౌంటర్ ఇచ్చింది. సుమకి డబ్బు పిచ్చి అందుకే ఎప్పుడూ షోలు చేస్తూ బిజీగా గడుపుతుందని చెప్పకనే చెప్పింది అంటూ ట్రోల్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed