విజయనగరంలో సినీనటి తమన్నా సందడి

by Prasanna |   ( Updated:2023-03-04 09:19:37.0  )
విజయనగరంలో సినీనటి తమన్నా సందడి
X

దిశ, డైనమిక్ బ్యూరో : విజయనగరం జిల్లాలో హీరోయిన్ తమన్నా సందడి చేశారు. జిల్లా కేంద్రంలోని మల్‌బార్ గోల్డ్ షోరూంను శనివారం తమన్నా ప్రారంభించారు. తమన్నా వస్తుందన్న సమాచారంతో అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో షోరూం వద్ద సందడి నెలకొంది. అనంతరం తమన్నా ప్రేక్షకులతో కాసేపు ముచ్చటించి వెళ్లిపోయారు. ఈ షోరూం ప్రారంభోత్సవంలో డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : Alia Bhatt: ప్రెట్టీ భట్.. అలియా వీడియో లీక్

Advertisement

Next Story